ETV Bharat / state

కుక్కలకు కుందేళ్లు... జింకకు మేకపాలు...!!

టిక్​టాక్​ చేసి కొందరు స్టార్​లు అవుతుంటే.. మరికొందరు కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఓ యువకుడు... మేక నుంచి జింకపిల్లకు పాలు పట్టిస్తూ, కుక్కలకు కుందేళ్లను ఆహారంగా అందిస్తూ వీడియో చేసి టిక్​టాక్​లో పోస్ట్ చేసి... జైలు పాలయ్యాడు.

కుక్కలకు కుందేళ్లు... జింకకు మేకపాలు
కుక్కలకు కుందేళ్లు... జింకకు మేకపాలు
author img

By

Published : May 21, 2020, 11:22 PM IST

టిక్​టాక్​ వల్ల జైలు పాలైన యువకుడు

అనంతపురం జిల్లా కంబదూరు మండలం అయ్యంపల్లి గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు వన్య ప్రాణులపై చేసిన టిక్​టాక్ కటకటాల పాలు చేసింది. అయ్యంపల్లిలో... నాగార్జున ఓ మేక నుంచి జింకపిల్లకు పాలు తాగిస్తూ, కుందేలు పిల్లలను కుక్కలకు ఆహారంగా అందిస్తూ చేసిన వీడియోలను టిక్​టాక్​లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... ఫారెస్ట్ అధికారులు అతనిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. వన్యప్రాణులపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ అధికారి రామ్ సింగ్ తెలిపారు.

ఇదీ చదవండి:

శభాష్ సోమశేఖర్.. గ్రామస్తుల చిత్రాలతో కరోనాపై అవగాహన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.