'చంద్రబాబు అందుకే జోలె పట్టాడు' - చంద్రబాబుపై మడకశిర ఎమ్మెల్యే విమర్శలు
అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే తిప్పేస్వామి పాల్గొన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, వంటలను ఆయన పరీశీలించారు. హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చి అన్ని చెరువులు నింపుతామని ఎమ్మెల్యే వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం దోచుకున్నది చాలక... ఇప్పుడు జోలెపట్టి ప్రజలను అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.