అనంతపురంలో 24 గంటల పాటు లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి.. పట్టణంలోని సీఐల బృందంతో వాహనదారులను అప్రమత్తం చేశారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనవసరంగా రోడ్లపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇప్పటికే.. కరోనా కేసులు అధికంగా ఉన్నాయని.. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రాయదుర్గంలో లాక్‌డౌన్ అమలు
రాయదుర్గం పట్టణంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు 36 గంటలు సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు తెలిపారు. కూరగాయల మార్కెట్, కిరాణా దుకాణాలు, మందుల దుకాణాలు, బ్యాంకులు, ఆస్పత్రుల్లో ప్రజలు కిక్కిరిసిపోతున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి:
హత్య కేసులు చాకచక్యంగా ఛేదించిన పోలీసులు.. వరించిన ఏబీసీడీ అవార్డులు