ETV Bharat / state

మద్యం అక్రమ రవాణా.. నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మద్యం అక్రమ రవాణా, నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు, పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిని అరెస్ట్​ చేసి కేసులు నమోదు చేశారు.

liquor-transporting-caught-by-excise-officers
అక్రమ మద్యం, నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు
author img

By

Published : Dec 28, 2020, 8:23 AM IST

అక్రమంగా మద్యం సరఫరా.. గంజాయి విక్రయాలు, తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో సిబ్బంది దాడులు కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేసిన దాడుల్లో.. ఈ దందాలకు సంబంధించిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణా మద్యం స్వాధీనం

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీ రాంపురం తండా వద్ద అక్రమంగా తరలిస్తున్న తెలంగాణా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి కృష్ణా జలాశయంలో పుట్టి ద్వారా సుమారు 30 కేసులు మద్యం తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎన్​ఫోర్స్​మెంట్, మాచర్ల ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు.

కర్ణాటక మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రంలోని కిరాణా దుకాణాలలో విక్రయిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు తనకల్లులోని రెండు కిరాణా దుకాణాల్లో సోదాలు నిర్వహించి...49 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వెయ్యి లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం

చిత్తూరు జిల్లా పీలేరు మండలం గూడ రేవుపల్లి గ్రామం దగ్గర పీలేరు ఎక్సైజ్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. నాటుసారా తయారీ కోసం నిల్వ ఉంచిన 1000 లీటర్ల ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు పీలేరు ఎక్సైజ్ సీఐ గురుప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి:

దొంగను పట్టించిన వాట్సప్‌ స్టేటస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.