అనంతపురం జిల్లా ఊటకల్లు గ్రామంలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి సమీపంలో ఉన్న కొండ ప్రాంతం నుంచి చిరుతలు వచ్చి మూడు గొర్రెలపై దాడి చేసి చంపాయని గ్రామస్థులు తెలిపారు. రాత్రివేళ్లలో గ్రామంలోకి ఎక్కడ వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. దాదాపు 10రోజుల నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించాలని... చిరుతలను బంధించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి-ఇష్టం మనది.. కష్టం నాన్నది