అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో చిరుత పులి సంచలనం కలకలం రేపింది. అమరాపురం మండలం చిట్నడుకు గ్రామం శివారులోని పంట పొలాల్లో చిరుత సంచరించింది. ఏకాంత అనే రైతు పూల తోటలో.. చిరుత తిష్ట వేసింది. దాన్ని చూసిన చుట్టుపక్కల రైతులు భయాందోళనలకు గురయ్యారు చెందారు. కుక్కలు దాన్ని చూసి మొరగడంతో కొద్దిసేపటి తర్వాత చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. రాత్రి సమయాల్లో.. పొలాల్లో పంటలకు నీరు అందించే సమయంలో చిరుత నుంచి ప్రాణహాని కలగవచ్చని రైతులు అన్నారు. వన్యప్రాణుల దాడి నుంచి అధికారులు తగు చర్యలు తీసుకొని రైతులను కాపాడాలని అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: విషజ్వరాల పంజా.. ఆందోళనలో ప్రజలు..