కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే అధికారులు అత్యాధునిక థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా.. రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ఈ పరికరాన్ని అమర్చారు.
ఇదీ చదవండి: పెళ్లైన మూడు రోజులకే కరోనాతో వరుడు మృతి
ఇందులోని కెమెరా.. ప్రయాణికుడిని ఫొటో తీస్తుంది. పక్కనే ఉన్న థర్మల్ స్క్రీనింగ్ యంత్రం.. ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతను ప్రత్యేకంగా అమర్చిన కంప్యూటర్ స్క్రీన్‌పై చూపిస్తుంది. ఒకవేళ ఉష్ణోగ్రత అధికంగా ఉంటే ఫొటోపై చూపిస్తూ.. అలారం మోగుతుంది. ప్రవేశ ద్వారం వద్ద విధులు నిర్వర్తించే రైల్వే సిబ్బంది.. అతడిని స్టేషన్లోకి రాకుండా క్షుణ్నంగా పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తారు.
ఇదీ చదవండి: