అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి చింతపూల ఉత్సవాన్ని అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాలరేడుగా పేరుగాంచిన నరసింహుడికి ఏడాది పొడవునా వివిధ రకాల వేడుకలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిరోజున స్వామివారి చింతపూల ఉత్సవాన్ని భక్తుల మధ్య అత్యంత వైభవంగా జరుపుతారు. లాక్ డౌన్ కారణంగా ఈ సంవత్సరం స్వామివారి వేడుకలో అర్చకులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. ఉభయ దేవేరులతో పాటు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం చింతపూల ఉత్సవాన్ని నిర్వహించారు.
నరసింహస్వామికి చింతపూల ఉత్సవం - devotional news in anantapur dst
అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి చింతపూల ఉత్సవాన్ని అర్చకులే నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా భక్తులను అనుమతించలేదని నిర్వాహకులు తెలిపారు.
అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి చింతపూల ఉత్సవాన్ని అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాలరేడుగా పేరుగాంచిన నరసింహుడికి ఏడాది పొడవునా వివిధ రకాల వేడుకలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిరోజున స్వామివారి చింతపూల ఉత్సవాన్ని భక్తుల మధ్య అత్యంత వైభవంగా జరుపుతారు. లాక్ డౌన్ కారణంగా ఈ సంవత్సరం స్వామివారి వేడుకలో అర్చకులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. ఉభయ దేవేరులతో పాటు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం చింతపూల ఉత్సవాన్ని నిర్వహించారు.
ఇదీ చూడండి
కరోనా ఉందనే విషయమే మర్చిపోయారు..!