అనంతపురం జిల్లా ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అవినీతి అధికారులు తమను ఆర్థికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ... నలుగురు మహిళా సూపర్ వైజర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి... ముగ్గురు సభ్యుల బృందాన్ని ఉరవకొండ కార్యాలయంలో విచారణకు పంపారు. ఏపీడీ లక్ష్మీకుమారి అధ్వర్యంలో బాధితులను కలిసి నేరుగా విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... ఐఎల్ఏ బిల్లు చేయమంటే కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్, సీనియర్ అసిస్టెంట్ హుసేన్ బాషా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అటెండెన్స్ సర్టిఫికెట్ కోసం వెళ్తే పేపర్లను ముఖానికి విసిరికొడుతున్నారని ఆరోపించారు. తమపై అక్రమ కేసులు పెడతామని భయపెడుతున్నారని వాపోయారు. కొంతమంది అంగన్వాడీల భర్తలకు మద్యం తాగించి తమపై నిఘా ఉంచుతున్నారని చెప్పారు. తమకు రక్షణ లేకుండా పోయిందని... ఇలా అయితే పని చేయలేమని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: