ETV Bharat / state

'క్షేత్రస్థాయి సహాయకుడి పై చర్యలు తీసుకోవాలి'

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం పెరుగుపాళ్యం పంచాయతీలో క్షేత్ర స్థాయి సహాయకుడు ప్రేమ్​నాథ్ అవినీతికి పాల్పడుతున్నాడని ఉపాధి కూలీలు ఆరోపణలు చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

labours fires on field assistant at ananthapur
author img

By

Published : May 24, 2021, 4:42 PM IST

ఉపాధి హామీ పనుల్లో భాగంగా అనంతపురం జిల్లా శెట్టూరు మండలం పెరుగుపాళ్యం పంచాయతీలో క్షేత్ర స్థాయి సహాయకుడు ప్రేమ్​నాథ్ అవినీతికి పాల్పడుతున్నాడని ఉపాధి కూలీలు ఆరోపణలు చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పెరుగుపాళ్యం గ్రామంలో లక్షల్లో ఉపాధి హామి పనుల్లో అవకతవకలు జరిగాయని కూలీలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విచారణకు వచ్చిన అధికారుల సమక్షంలో క్షేత్రస్థాయి సహాయకుడు హాజరుకాకపోవటంతో వారు మండిపడ్డారు. అనంతరం అధికారులతో వాగ్వాదానికి దిగారు.అధికారులు పలువురు కూలీలను.. సమస్యలను అడిగి తెలుసుకుని అవకతవకలు జరిగాయని నిర్థరించారు. వారం రోజుల్లో లోతుగా దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. సంబంధిత క్షేత్రస్థాయి సహాయకుడి పై చర్యలు తీసుకుని తమ సొమ్ము వెంటనే చెల్లించకపోతే.. ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులకు లోకేశ్ పరామర్శ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.