ETV Bharat / state

కేవైసీ అప్ డేట్ కావట్లేదు.. అధికారులూ స్పందించండీ.. !

author img

By

Published : Jan 31, 2020, 5:34 PM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని , సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో.. కేవైసీ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ కేవైసీ అప్ డేట్ కావాలంటే.. రెండు మూడు రోజుల సమయం వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

kyc problems in madakasira sub register office at ananthapuran
కేవైసీ అప్డేట్​ కావట్లేదు.. అధికారులూ స్పందించండీ.. !

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొన్ని రోజులుగా కేవైసీ అప్ డేట్ అయ్యే సర్వర్ పనిచేయడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రయవిక్రయాలు నిలిచిపోయి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. కేవైసీ అప్ డేట్ కోసం హిందూపురం నియోజకవర్గంలోని మీ సేవ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు అంటున్నారు. అక్కడ మీసేవ సెంటర్​లో అప్ డేట్ చేయించాక.. మడకశిర రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలు జరుపుకుంటున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవైసీ అప్ డేట్ అయినట్టు చూపించకపోవటంతో.. క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ జరగాలంటే రెండు, మూడు రోజుల సమయం పడుతోంది. కేవైసీ సమస్య వల్ల తాము రెండు రోజులు వేచి చూడాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. సర్వర్ సమస్య లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

'చంపుతాడనే భయంతో... తండ్రిని చంపేశాడు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.