ETV Bharat / state

చట్టవిరుద్ధంగా విధులకు లైసెన్స్‌ ఇవ్వలేదు - విజయపాల్‌ బెయిల్ పిటిషన్​​ కొట్టివేత - HC Rejected Vijay Pal Bail Petition - HC REJECTED VIJAY PAL BAIL PETITION

AP HC Rejected Vijay Pal Bail Petition : రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్ర హింసలకు గురిచేసిన కేసులో సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ ఆర్‌.విజయ్‌పాల్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న ఆయన అభ్యర్థను న్యాయస్థానం తోసిపుచ్చింది. విజయ్‌పాల్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్​లోని అరోపణలు అందోళనకరమైనవి, తీవ్రమైనవని స్పష్టంచేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్ట విరుద్ధంగా వ్యవహరించి పౌరుల జీవనాన్ని, స్వేచ్ఛను హరించేలా విధులు నిర్వర్తించేందుకు అధికారులకు రాష్ట్రప్రభుత్వం ఎలాంటి లైసెన్సూ ఇవ్వలేదని ధర్మాసనం తేల్చిచెప్పింది.

AP HC  Rejected  Vijay Pal Bail Petition
AP HC Rejected Vijay Pal Bail Petition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 10:14 AM IST

High Court Refuse Vijay Pal Bail Plea : మే 2021లో తనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి సీఐడీ అధికారులు రాత్రంతా కస్టడీలో నిర్బంధించి హతమార్చేందుకు యత్నించారని రఘురామకృష్ణరాజు నగరంపాలెం పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్, అప్పటి నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్, తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో విజయపాల్‌ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనల తర్వాత సోమవారం తీర్పు వెలువరించిన ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న ఆయన అభ్యర్థను తోసిపుచ్చింది. విజయ్‌పాల్‌పై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​లోని అరోపణలు అందోళనకరమైనవి, తీవ్రమైనవని స్పష్టంచేసింది. రఘురామపై కేసు నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఇరువైపులా వాదనలను బట్టి అర్థమవుతోందని న్యాయస్థానం పేర్కొంది.

చట్ట నిబంధనలను అమలు చేసే యంత్రాంగంలోని కీలక భాగస్వామైన విజయపాల్‌ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో భిన్నమైన, కఠిన ప్రమాణాలను అనుసరించాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని గుర్తుచేసింది. ఎఫ్ఐఆర్​ నమోదులో తీవ్ర జాప్యం చోటు చేసుకుందన్న కారణంతో ఈ కేసులో ఉన్న వాస్తవాలను విస్మరించలేమని వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో బాధితుడైన రఘురామకు ఎలాంటి గాయాలు కాలేదని ఎవరూ చెప్పలేదని ధర్మాసనం గుర్తుచేసింది.

రఘురామ పట్ల అనుచితంగా వ్యవహరించిన వాళ్లు పోలీసు అధికారులు, రాజకీయ పెద్దలు అనే ఆరోపణలున్న నేపథ్యంలో గాయాల తీవ్రత ఎంత అనేది అప్రస్తుతమని ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్​లోని ఆరోపణలను పరిశీలిస్తే ఘటన నాలుగు గోడల మధ్య జరిగిందనే విషయం స్పష్టమవుతోందని తెలిపింది. ఆ ప్రాంగణంపై విజయ్‌పాల్‌కు పూర్తి నియంత్రణ ఉందని, సాధారణ ప్రజలకు అక్కడ ఏమి జరిగిందో తెలిసే అవకాశమే లేదంది. కాబట్టి ఈ తరహా కేసులో విజయ్‌పాల్‌ను దర్యాప్తులో భాగంగా విచారించడం ఎంతైనా అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే విచారణకు అవరోధంగా మారుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

High Court on Raghurama Torture Case : కేసులో ఆరోపణ ఎదుర్కొంటోంది విజయ్‌పాల్‌ మాత్రమే కాదని ఆయనతోపాటు మరికొందరు సహ నిందితులున్నారని హైకోర్టు తీర్పులో తెలిపింది. పిటిషనర్‌ సీనియర్‌ పోలీసు అధికారి ఆయనతోపాటు కేసులో ఉన్న సహ నిందితులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేసింది. రఘురామపై కస్టడీలో దాడి జరిగిన సమయంలో ఆ కేసు దర్యాప్తు అధికారిగా విజయపాల్‌ ఉన్నారని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతో విలువైనవిని వెల్లడించింది. వాటికి ముప్పు ఉందని పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఆ హక్కులను రక్షించడంలో సంబంధిత దర్యాప్తు అధికారి బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పింది. పౌరులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా చూడటం ఎంత ముఖ్యమో అదే సమయంలో వారి స్వేచ్ఛా జీవనానికి ముప్పు వాటిల్లేలా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడటమూ కోర్టుకు అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. చట్ట విరుద్ధంగా వ్యవహరించి పౌరుల జీవనాన్ని, స్వేచ్ఛను హరించేలా విధులు నిర్వర్తించేందుకోసం అధికారులకు రాష్ట్రప్రభుత్వం ఎలాంటి లైసెన్సూ ఇవ్వలేదని హైకోర్టు తేల్చిచెప్పంది.

'రాత్రంతా లాఠీలు, రబ్బరు బెల్ట్‌లతో కొట్టారు - చంపేస్తామని బెదిరించారు' - RAGHURAMA CID CUSTODY ALLEGATION

'అదే నాకు చివరి రోజు అవుతుందనుకున్నా'- నాటి భయానక అనుభవంపై రఘురామ - RRR Interview

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.