కిసాన్ ట్రస్ట్ ద్వారా జిల్లాలోని రైతులకు ఆసరా లభిస్తుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలోని పంట ఉత్పత్తులను కిసాన్ రైలు ద్వారా రాజధాని నగరానికి తరలించే క్రమంలో.. రైతులకు భారంగా మారినా.. రవాణా ఖర్చులు తగ్గించడానికి కిసాన్ ట్రస్టును ఏర్పాటు చేసినట్టు ఎంపీ తలారి రంగయ్య తెలిపారు.
50 మంది ప్రజాప్రతినిధులు ఒక్కరు రూ.30 వేల చొప్పున ట్రస్టుకు ఆర్థిక సహాయం అందించాలని పిలుపునిచ్చారు. రైతులు మొదట ట్రస్టు ద్వారా రవాణా ఖర్చులకు ఉపయోగించుకొని తర్వాత ట్రస్టుకు రీఫండ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. మొత్తం రూ.15 లక్షలు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటు ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇవాళ ఎంపీలు రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు చెక్కులను అందించారు. రైతుల పక్షపాతిగా వైకాపా ప్రభుత్వం ఉంటుందని వారు చెప్పారు.
ఇదీ చదవండి: బెంగళూరులో గంజాయి చాక్లెట్ల కలకలం