ETV Bharat / state

‘అనంత’కు కిసాన్‌ రైలు స్కోచ్‌ అవార్డు

author img

By

Published : Jan 17, 2021, 1:48 PM IST

అనంతపురం జిల్లాకు మరో ఘనత దక్కింది. కిసాన్‌ రైలు వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను జిల్లా నుంచి తొలిసారిగా దిల్లీ మార్కెట్‌కు మూడుసార్లు తరలించిన తరుణంలో కిసాన్‌ రైలు స్కోచ్‌ అవార్డు దక్కించుకుంది. స్కోచ్‌ అవార్డు కమిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఈ విషయం వెల్లడించారు.

kisan-rail-scotch-award
‘అనంత’కు కిసాన్‌ రైలు స్కోచ్‌ అవార్డు
kisan-rail-scotch-award
‘అనంత’కు కిసాన్‌ రైలు స్కోచ్‌ అవార్డు

కిసాన్‌ రైలు స్కోచ్‌ అవార్డుకు రాష్ట్రంలో అనంతపురం ఎంపికైంది. స్కోచ్‌ అవార్డు కమిటీ ఛైర్మన్‌ సమీర్‌కొచ్చర్‌, డైరెక్టర్‌ గురుశరణ్‌ డంజల్‌, ఇతర కమిటీ సభ్యులు శనివారం దిల్లీ నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా వీక్షణ సమావేశం నిర్వహించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో 160 జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొనగా.. 20 జిల్లాలను అవార్డుకు ఎంపిక చేశారు. అందులో రాష్ట్రంలోని ‘అనంతపురం జిల్లాకు తొలిస్థానం దక్కటంతో సిల్వర్‌ అవార్డుకు ఎంపిక చేశారు.

కలెక్టర్‌ గంధం చంద్రుడు పేరు మీద జూమ్ యాప్ ద్వారా అవార్డును అందజేశారు. దీంతో జిల్లా ఉద్యాన రైతులు, అనంతపురం టమోటా మండీ వ్యాపారులను ఉద్యానశాఖ అధికారులు కలెక్టర్​ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీడీ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డీడీ పద్మలత, ఏడీఎచ్‌లు సతీష్‌, చంద్రశేఖర్‌, ఏపీడీలు ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

రామ మందిర నిర్మాణ నిధుల సేకరణ.. కొనసాగిన శోభాయాత్ర

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.