అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఉన్న భోగేశ్వర-చెన్నకేశవ ఆలయంలో కార్తిక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్తిక దీపకాంతులతో పురాతన ఆలయం శోభిల్లింది. ఆలయంలో కొలువైన పార్వతి, భూదేవి సహిత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు.. మహా మంగళ హారతలు నిర్వహించారు. పెద్దఎత్తున వచ్చిన భక్తులు.. ఉత్సవ మూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చదవండి: నేటితో తుంగభద్ర పుష్కరాలు పరిసమాప్తం