అనంతపురం జిల్లాలో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఉరవకొండ సమీపంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. కర్ణాటకలో మద్యం రేట్లు తక్కువగా ఉండడం వల్ల అక్రమంగా తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సీఐ శ్యాంప్రసాద్ తెలిపారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి... కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది చదవండి 'మురుగు వేధిస్తోంది... అధికారులూ.. సమస్యను పరిష్కరించండి'