కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమడగూరు మండలం గోపాల్ నాయక్ తండాకు చెందిన నారాయణ నాయక్.. కర్ణాటక మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నాట్లు సమాచారం అందుకున్నారు. ఈ మేరకు కర్ణాటక నుంచి ద్విచక్రవాహనంపై తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు.
నారాయణ నాయక్.. కర్ణాటక చాకివేలు నుంచి మద్యాన్ని తీసుకొస్తుండగా.. మొగలి చెట్లతండాకు చెందిన జానకమ్మ విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి వారినుంచి 186 సీసాల మద్యం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చూడండి:
తిరుచానూరులో విషాదం: చెరువులోకి దూకి సోదరులు ఆత్మహత్య