అనంతపురం జిల్లా కుందుర్పి, శెట్టూరు మండలాల్లో కర్ణాటక మద్యం రవాణా చేస్తున్న వ్యక్తులను ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. కంబదూరు సీఐ రవి ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. కంబదూరు పరిసర ప్రాంతంలో తనిఖీలు చేసిన సీఐ... ఇద్దరు వ్యక్తులను అదువులోకి తీసుకున్నారు. వీరి నుంచి 40 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శెట్టూరు మండలంలో ద్విచక్రవాహనాలపై తీసుకెళ్తున్న 108 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. వీరిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :
పుట్టవారిపాలెం వద్ద తెలంగాణ మద్యం పట్టివేత.. 20 ఫుల్ బాటిళ్లు స్వాధీనం