అనంతపురం జిల్లా మడకశిర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది దాడులు జరిపారు. మండలంలోని మరువపల్లి గ్రామం క్రాస్ వద్ద బీమరాజు అనే వ్యక్తి కారులో 177 కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తుండగా అతన్ని అరెస్టు చేశారు. మద్యాన్ని, కారుని స్వాధీనం చేసుకున్నారు.
నియోజకవర్గంలోని గుడిబండ మండలంలో మారెక్క అనే మహిళ వద్ద 15 కర్ణాటక మద్యం పాకెట్స్ లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ఇది చదవండి కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం