ETV Bharat / state

అడ్డదారిలో అనంతకు దూసుకొస్తున్న పొరుగు మద్యం - అనంతపురంలో మద్యం కేసులు

పొరుగు మద్యం పరుగు పరుగున వస్తోంది. అడ్డదారుల్లో అనంతకు తన్నుకొస్తోంది. సరిహద్దుల్లో కట్టడి లేక ఎం‘చుక్కా’ పరవళ్లు తొక్కుతోంది. చెక్‌పోస్టులకు చెక్‌ పెడుతూ.. తనిఖీలను తోసిరాజని కలర్‌‘పుల్లు’గా వచ్చేస్తోంది. పాల వాహనాలు, నీళ్ల ట్యాంకర్లు, అత్యవసర, నిత్యావసర వాహనాల్లో దర్జాగా వస్తోంది. నాయకుల ఎత్తులు.. పోలీసు శాఖలో పలువురి సహకారంతో సరిహద్దుల్లేనంతగా తరలి వస్తోంది.

karnataka liqour to ananthapur
అడ్డదారిలో దూసుకొస్తున్న పొరుగు మద్యం
author img

By

Published : Jun 27, 2020, 3:11 PM IST

karnataka liqour to ananthapur
కేసులు, పట్టుబడిన నిల్వలు

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై పోలీసులు రోజూ మాదిరి తనిఖీలు చేస్తున్నారు. ఐషర్‌ వాహనాల్లో నిత్యావసరాలు, కూరగాయల బస్తాలు ఉన్నాయి. కొంచెం లోపల పరిశీలించి చూస్తే.. భారీగా కర్ణాటక మద్యం సీసాలు. అసలు విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. రాప్తాడు పరిధిలో వివిధ మండలాల నుంచి వాహనదారులు రైతుల నుంచి కూరగాయల బస్తాలు తీసుకెళ్లి వాటిని కర్ణాటకలో విక్రయిస్తున్నారు. ఆపై అక్కడినుంచి మద్యం ఇలా తెచ్చి స్థానిక వ్యాపారులకు అందించి సొమ్ము చేసుకుంటున్నారు.

దశల వారీగా మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించి సొంతంగా నడుపుతోంది. అందులోనూ మద్యం ధరలను 75 శాతం పెంచింది. ఈ విధానంతో మద్యం బాబులకు చిక్కు వచ్చి పడింది. మద్యానికి పెద్ద మొత్తం ఖర్చు చేయలేక.. సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేసి తెస్తున్నారు. మరికొందరు కార్లు, సరకుల వాహనాల్లో రాత్రికిరాత్రి సరకు తెచ్చుకొని గుట్టుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా రోజూ భారీగా మద్యం పట్టుబడుతుండటం గమనార్హం.

కలిసొస్తున్న సరిహద్ధు..
జిల్లాలో 23 మండలాల పరిధిలో 210 కిలోమీటర్ల మేర కర్ణాటక సరిహద్దు ఉంది. పక్కనే ఉన్న కర్ణాటక నుంచి మద్యం జిల్లాలోకి అక్రమంగా రవాణా అవుతోంది. హిందూపురం, మడకశిర, కదిరి, రాయదుర్గం, గుంతకల్లు తదితర నియోజకవర్గాల్లో దాదాపు అన్ని మండలాల్లో కర్ణాటక సరిహద్దు విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల నుంచే జిల్లాలోని ఇతర మండలాల్లోకి కొందరు మద్యం అక్రమంగా తరలిస్తున్నారు. ఇదే సమయంలో నాటుసారాను విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు.

కావాల్సినంత సహకారం...
కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో పోలీసు, ఎక్సైజ్‌ శాఖలకు చెందిన కొందరు సిబ్బంది హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారికి వీరు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇలా సహకరిస్తున్నారని ఇటీవల సోమందేపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను ఆ శాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. నాటు సారా స్థావరాలపై దాడులు జరిగే సమయాని కంటే ముందే సిబ్బంది నుంచి తయారీదారులకు సమాచారం అందడంతో వారు పరారవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నాయకుల కనుసన్నల్లోనే..
కర్ణాటక మద్యం తరలిస్తూ... అమ్ముతూ పట్టుబడిన వారిలో కొంతమందికి జిల్లాలోనే కొన్ని రహస్య ప్రాంతాల్లో ఆ మద్యం హోల్‌సేల్‌గా చిక్కుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీలకు అతీతంగా కొందరు నాయకులు అక్రమార్జన కోసం వాహనాల్లో రాత్రివేళ చెక్‌పోస్టులు దాటించి సరకును జిల్లాకు తీసుకొస్తున్నారు. అయితే అప్పుడప్పుడు తరలిస్తూ ఇలా దొరుకుతోంది సరఫరాదారులు మాత్రమే. క్షేత్రస్థాయిలో మద్యం అమ్మకాలు జరిపేవారు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. సూత్రధారులైన సరఫరాదారులు చిక్కకపోవడంతో మద్యం అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది.

చేతివాటానికి అలవాటుపడి..
జిల్లా సరిహద్దు మండలాల్లో 96 చెక్‌పోస్టులు, 20 మొబైల్‌ చెక్‌పోస్టులూ పని చేస్తున్నాయి. మద్యం, ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి వీటిని ఏర్పాటు చేశారు. ఆయా చెక్‌పోస్టుల్లో పనిచేసే కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో మద్యం తరలిస్తున్న వాహనాలు సులువుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవల గుత్తి చెక్‌పోస్టు దగ్గర ఓ కారులో ఎస్కేయూ ఉద్యోగితోపాటు అతని స్నేహితుడు మద్యం తీసుకెళ్తుండగా ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ పట్టుకున్నాడు. అయితే వారి నుంచి నగదు, కొన్ని మద్యం సీసాలు తీసుకుని వదిలేశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో అతడు సస్పెండ్‌కు గురయ్యాడు.

హద్దు మీరితే కొలువు ఖాళీయే..

మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తాం. ఎక్కడైనా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తే సర్వీసు నుంచి తొలగించడానికి కూడా వెనకాడం. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే - సత్యఏసుబాబు, ఎస్పీ

ఇదీ చదవండి: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య.. కుమార్తె ఫిర్యాదుతో వెలుగులోకి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.