అనంతపురం జిల్లా మడకశిర మండలం మణూరు గ్రామం క్రాస్ వద్ద అబ్కారీ శాఖ తనిఖీలు నిర్వహించారు. ఒక వ్యక్తి ఆటోలో తరలిస్తున్న 96 కర్ణాటక మద్యం ప్యాకెట్లు లభ్యమయ్యాయి. మద్యంను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మరో చోట వెంకట రంగప్ప, కిష్టప్ప అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంలో 95 కర్ణాటక మద్యం ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద మద్యం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దాడుల్లో పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సీఐ రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా కర్ణాటక మద్యం అమ్మే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.
ఇది చదవండి 'ఉన్మాద పాలన సాగిస్తే చూస్తూ సహించాలా?'