అనంతపురం జిల్లా కదిరి పట్టణం కుటాగుళ్ల తారకరామా నగర్లో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేశారు. 280 సీసాల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు డీఎస్పీ షేక్ లాల్అహ్మద్ తెలిపారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 5 లీటర్ల నాటుసారాని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: పాలబావి వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు