ETV Bharat / state

రాజకీయ కక్షతోనే రాజధాని తరలింపు : కాలవ శ్రీనివాసులు

పరిపాలన చేతగాక...ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకోడానికి వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ఎన్నికల సమయంలో రాజధాని అమరావతి అని చెప్పి, ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నరు. రాయలసీమలో హైకోర్టు పెట్టినా ప్రయోజనం ఏంలేదన్నారు. పాలన రాజధానిగా విశాఖే ఎందుకనే ప్రశ్నకు వైకాపా నాయకుల వద్ద సమాధానం లేదని కాలవ విమర్శించారు.

కాలవ శ్రీనివాసులు
కాలవ శ్రీనివాసులు
author img

By

Published : Oct 10, 2020, 9:41 PM IST

రాష్ట్రం అసమర్థ పాలనలో ఉందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయ కక్షతో రాజధాని మార్చేందుకు సిద్ధపడ్డారని మండిపడ్డారు. పాలన రాజధానిగా విశాఖని ఎన్నుకోవడానికి గల కారణాలను చెప్పే పరిస్థితిలో అధికార పార్టీ నాయకులు లేరని ధ్వజమెత్తారు. రాయలసీమ వాసులకు రాజధాని దూరం చేసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి మాట మార్చడం సరికాదన్నారు.

పరిపాలన చేతకాకే ఆర్థిక వనరులను సమకూర్చుకునే శక్తిసామర్థ్యాలు లేకపోవడంతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చిందని ఆరోపించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తును వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, జగన్ నుంచి రాష్ట్రానికి పెనుప్రమాదం ఉందన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కాలవ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

దర్శకుడు రాజమౌళి గురించి ఈ విషయాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.