ETV Bharat / state

మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలి: కాల్వ శ్రీనివాసులు - కాల్వ శ్రీనివాసులు తాజా వార్తలు

శాసనమండలిలో వైకాపా మంత్రులు దాదాగిరికి దిగారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. మండలిలో ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. తెదేపా సభ్యులపై దాడికి పాల్పడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

kalva srinivasulu fires on ycp ministers
కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రి
author img

By

Published : Jun 18, 2020, 7:51 PM IST

శాసనమండలిలో వైకాపా మంత్రులు దాదాగిరికి దిగారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పదేపదే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. మండలిలో ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. తెదేపా సభ్యులపై దాడికి పాల్పడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

'వారికి చట్టం, రాజ్యాంగం, చట్టసభలు వీటిపైన ఏమాత్రం గౌరవం లేదు. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్లే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. మండలిలో తెదేపా సభ్యులకు రక్షణ లేకుండా పోయింది. గత కొద్ది రోజులుగా వైకాపా ప్రభుత్వం బీసీ నాయకులపై కేసులు పెడుతోంది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే వెంటనే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ని బర్తరఫ్ చేయాలి. '--- కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రి

ఇవీ చదవండి...: వైకాపా మంత్రులపై మండలి ఛైర్మన్​కు తెదేపా ఎమ్మెల్సీల ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.