ETV Bharat / state

రైతులకు 2020 ఖరీఫ్ ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించాలి: కాలవ శ్రీనివాసులు

సీఎం జగన్​కు మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు లేఖ రాశారు. అనంతపురం జిల్లా రైతులకు 2020 సంవత్సరానికి ఖరీఫ్ ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించాలని.. వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు.

కాలవ శ్రీనివాసులు
కాలవ శ్రీనివాసులు
author img

By

Published : Jun 18, 2021, 9:33 PM IST

అనంతపురం జిల్లా రైతులకు 2020 సంవత్సరానికి ఖరీఫ్ ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించి వెంటనే వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. జిల్లాలో రూ.వెయ్యి కోట్లకుపైగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

కాలవ శ్రీనివాసులు లేఖ
కాలవ శ్రీనివాసులు లేఖ

"గతేడాది ఖరీఫ్​లో జిల్లాలో 12.26 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతిని రూ.2500కోట్లు పెట్టుబడుల రూపంలోనే రైతులు నష్టపోయారు. 2021 ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా ఇంతవరకూ ఇన్‌పుట్ సబ్సిడీ ఊసేలేదు. ఈక్రాప్ నమోదు ప్రక్రియ సక్రమంగా లేని కారణంగా బీమా పరిహారమూ రైతులకు ఆశించిన మేర అందట్లేదు. గత ఖరీఫ్​లో 2.29 లక్షల మంది రైతులు పంట నష్టపోతే రూ.212 కోట్లు అదించి చేతులు దులుపుకున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపుపై స్పందించకుంటే జిల్లా రైతుల పక్షాన ప్రత్యక్ష పోరాటాలకు దిగుతాం." అని హెచ్చరించారు.

ఇదీ చదవండీ... ప్రత్యేక హోదా: 'పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.