తెలుగుదేశం హయాంలో నిర్మించిన ఇళ్లకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించలేదని రాయదుర్గం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి తెదేపా నేత కాలవ శ్రీనివాసులు, పార్టీ శ్రేణులు అండగా నిలిచారు. రాష్ట్రంలో 132 ప్రాంతాల్లో ప్రభుత్వం భూ సేకరణ చేపట్టిందని కాలవ అన్నారు. అందులో భారీ అవకతవకలు భూ కుంభకోణాలు జరిగినట్లు తెలిసిందని చెప్పారు.
రాయదుర్గంలో ప్రజల ఇళ్ల కోసం ప్రభుత్వం 17.5 ఎకరాల భూసేకరణ చేపట్టిందన్నారు. వైకాపా నేతలు పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాయదుర్గం పట్టణంలో వైకాపా నాయకుల భూ కుంభకోణంపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. వైకాపా నాయకులు విచారణకు రావాలని కాలవ సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: