ETV Bharat / state

వేరుశనగ రైతన్న కష్టాన్ని తీర్చే కదిరి-లేపాక్షి వంగడం - అనంతపురం జిల్లా వార్తలు

వర్షాభావ పరిస్థితుల్లో వేరుశనగ పంటను సాగుచేసే రైతన్నలకు ఓ శుభవార్త. వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లను తట్టుకుని.. అధిక దిగుబడి ఇచ్చే వేరుశనగ వంగడాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కదిరి-లేపాక్షి వంగడం వేరుశనగ రైతులు కష్టాలను తీర్చనుంది.

kadiri lepakshi peanut
kadiri lepakshi peanut
author img

By

Published : Oct 23, 2020, 6:41 PM IST

రాయలసీమ అనగానే వర్షాభావ పరిస్థితులు గుర్తొస్తాయి. వెంటాడే కరవు పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ నాలుగు జిల్లాల్లో రైతులు మాత్రం వేరుశనగ పంటను సాగుచేస్తుంటారు. వర్షాభావాన్ని తట్టుకొని, చీడ పీడలను ఎదుర్కొనెలా కొత్త రకం వేరుశనగ విత్తనాలను అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కదిరి-లేపాక్షి రకం విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా మూడేళ్ల పాటు 10 చోట్ల ఈ రకం విత్తనాలపై పరిశోధనలు నిర్వహించారు.

రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్​లో ఏడు లక్షల హెక్టార్లకు పైగా రైతులు వేరుశనగ సాగుచేస్తుంటారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 4.60 లక్షల హెక్టార్లలో సాగు చేస్తుండగా, చిత్తూరు జిల్లాలో లక్షా 12 వేల హెక్టార్లు, కర్నూలు లో 88 వేల 266 హెక్టార్లు, కడపలో 24,600 హెక్టార్లలో సాగవుతోంది. ఎక్కువ మంది రైతులు కె-6, కె-9 రకాలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన కొత్త వంగడం రైతులకు అన్ని విధాలా ప్రయోజనంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. కదిరి-లేపాక్షి రకంలో 51 శాతం నూనె పాళ్లు ఉంటుంది. ఈ రకాన్ని రాయచూరు, గుజరాత్​లోని పలు రకాల కన్నా 21 నుంచి 44 శాతం నూనె ఎక్కువని తేల్చారు.

కొత్త రకం వేరుశనగ ఖరీఫ్​లో పంట కాలం 107 నుంచి 113 రోజులు కాగా, రబీలో 117 నుంచి 120 రోజులుగా ఉంటుంది. దీన్ని సాగుచేసిన రైతుల అనుభవాలను బట్టి రసం పీల్చే తామర పురుగు, పచ్చపురుగు, పొగాకు లద్దెపురుగులను తట్టుకొని దిగుబడి ఇస్తుంది. ముఖ్యంగా కాళహస్తి తెగులును తట్టుకొని దిగుబడి ఇచ్చే రకంగా శాస్త్రవేత్తల ప్రయోగాల్లో స్పష్టమైంది. వేరుశనగ చెట్టుకు తొలుత వచ్చిన ఆకులు పంట కాలం పూర్తయ్యే వరకు ఉండటంవల్ల పశుగ్రాసం మిగిలిన రకాల కన్నా 28 నుంచి 48 శాతం ఎక్కువగా దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు

2017 లో కదిరి-లేపాక్షి రకం క్షేత్రస్థాయి ప్రయోగాలకు రాగా, ప్రస్తుతం అనంతపురం జిల్లాలో వేల ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. అప్పట్లో విత్తనాలు పొందిన రైతులు, పంట దిగుబడిని విత్తనంగా తోటి రైతులకు విక్రయించారు. దీంతో పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ వేరుశనగ వంగడం విస్తరించింది. ఈసారి ఖరీఫ్​లో తెలంగాణ రైతులు సైతం ఈ విత్తనాలు సాగుచేసినట్లు స్థానిక రైతులు అంటున్నారు.

ఇదీ చదవండి : రుచి లేని దివాన్‌చెరువు సీతాఫలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.