అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని... తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఆత్మీయంగా కలుసుకున్నారు. గ్రామంలో రఘువీరా కుటుంబ సభ్యులు నిర్మించిన నూతన ఆలయాలను ఇద్దరూ కలిసి సందర్శించారు. అనంతరం స్వామివారి పూజ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పార్టీలతో సంబంధం లేకుండా కీలక నాయకులను కలుస్తున్నానని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
జెండాలు అజెండాలు పక్కన బెట్టి విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉద్యోగస్థులతో కలసి ముందుకు సాగుతున్నానని చెప్పారు. అందులో భాగంగానే రఘువీరా రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. ఆయన నిర్మించిన దేవాలయాలను దర్శించుకున్నానని వెల్లడించారు. రాయలసీమ నీటి విషయంలో చేయాల్సిన పోరాటంపై నిర్ణయించుకున్న అజెండా గురించి ఆయనకు వివరించానని చెప్పారు. అతి త్వరలోనే రఘువీరా నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
CASE ON JC PRABAKHAR: జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రిలో కేసు నమోదు
TDP: 'అక్రమ మైనింగ్‌కు తండ్రి బీజం వేస్తే.. కొడుకు పెంచి పెద్దది చేస్తున్నారు'