రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజా పరిపాలనలో విఫలమైందని జనసేన రాష్ట్ర కార్యదర్శి మధుసూదన రెడ్డి విమర్శించారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో జిల్లాస్థాయి కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించినట్లు మధుసూదన రెడ్డి చెప్పారు. మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వైకాపా ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కమిటీ సభ్యులు కృషి చేసేలా ఉండాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో వైకాపాకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జనసేన నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీ.. వైకాపాను ఎదుర్కోవడంలో విఫలమైందని విమర్శించారు. వైకాపాకు ఎదురు నిలిచి పోరాడే శక్తిగా జనసేన నిలుస్తుందని స్పష్టీకరించారు. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ.. సమస్యలపై ప్రభుత్వంతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: