మొహర్రం సందర్భంగా అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో తేరువీధి, కోటవీధి, మైన్ బజార్లలో కొన్ని రోజుల క్రితం పీర్లు కొలువుదీరాయి. పీర్లకు వెండి గొడుగులతో, వస్త్రాలతో, పూలతో అలంకరించి ముజావర్లు ప్రతి రోజు పూజలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా మొహర్రం వేడుకలు జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో హిందూ, ముస్లింలు చక్కెర చదివింపులు చేయించి పీర్లను దర్శించుకున్నారు. ఆదివారం పట్టణంలో ఉన్న అన్ని పీర్లకు జలధి ఉత్సవం నిర్వహించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా జలధి ఉత్సవంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'నూతన్నాయుడుతో నాకు ప్రాణహాని ఉంది'