అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరుతూ... స్వచ్ఛంద సంస్థల జేఏసీ సభ్యులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నెలరోజులుగా చేస్తున్న ఈ ఉద్యమానికి తెలుగుదేశం, భాజపా, జూనియర్ ఎన్టీర్, బాలకృష్ణ అభిమాన సంఘాలు మద్దతు తెలిపాయి. నిరసనపై ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు... ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు శాంతియుత నిరసన చేస్తుంటే.. తమపై అక్రమ కేసులు పెడుతున్నారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.