ఓబుళాపురం గనుల కేసు అనంతపురం జిల్లా అంశమైనందున విశాఖ సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ కోరింది. కేసును విశాఖకు బదిలీ చేస్తే తనకేమీ అభ్యంతరం లేదని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. తమకూ అభ్యంతరం లేదని నిందితులు బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్, రాజగోపాల్ చెప్పారు. కానీ తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ కృపానందం... ఈ కేసును విశాఖకు బదిలీ చేయవద్దని కోరారు. అభ్యంతరాలపై వాదనల కోసం సీబీఐ కోర్టు విచారణ ఈనెల 10కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: జగన్ వ్యక్తిగత మినహాయింపుపై సీబీఐ తీవ్ర అభ్యంతరం