ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన ఐదుగురిని అనంతపురం జిల్లా కదిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని జౌకుపాళ్లెం వీధి, కంచుకోట ప్రాంతాలకు చెందిన రామ్మోహన్, ఆంజనేయులు, ఆదిల్, ఇర్ఫాన్, ఆరిఫ్ అనే నిందితులు మెుబైల్ ఫోన్లను వినియోగించి బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా దాడి చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని 2 చరవాణులు, రూ. 55 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: