ETV Bharat / state

వర్షాలు ఆదుకున్నాయి.. పురుగులు పొట్టన పెట్టుకున్నాయి - వేరుశనగ రైతుల కష్టాలు

ఈసారి అనంతపురం జిల్లాలో మంచి వర్షాలు కురిసినా.. పంటలపై పురుగులు, తెగుళ్లు విజృంభిస్తున్నాయి. ఏటా వర్షం కోసం తపించిపోయే అనంతపురం రైతులు.. ఈసారి సకాలంలో వర్షాలు రావటంతో హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, నిరంతర వానలకు పంటలు దెబ్బతింటున్న పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులపాటు రోజూ కురిసిన వర్షంతో వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం తదితర పంటల్లో పురుగులు, తెగుళ్ల ఉద్ధృతి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పురుగుల బెడద తప్పించుకోటానికి వేల రూపాయలు వెచ్చించి క్రిమిసంహార మందులు చల్లాల్సి వస్తోంది. జిల్లా అంతటా నిరంతరాయంగా వర్షాలు కురవటంతో కలుపు తీయటానికి కూలీల కొరత తీవ్రమైంది.

ground nut FARMERS DIFFICULTIES
ground nut FARMERS DIFFICULTIES
author img

By

Published : Aug 13, 2020, 10:51 PM IST

అనంతపురం రైతుల కష్టాలు

అనంతపురం జిల్లావ్యాప్తంగా పుష్కలంగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఒకింత ఆనందం వ్యక్తమవుతున్నా.. పురుగుల ఉద్ధృతితో అల్లాడిపోతున్నారు. జిల్లా అంతటా పదిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ పంటలకు అనేక సమస్యలు వచ్చాయి. పురుగుల ఉద్ధృతి అధికం కావటంతో విచ్చలవిడిగా పురుగు మందులు చల్లుతుండటంతో పెట్టుబడి భారం పెరుగుతోంది. మంచి వర్షాలు కురిసినప్పటికీ ఈసారి పంటలకు చీడ, పీడలు అధికమైనట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నిచోట్లా వర్షాలు విరామం లేకుండా కురుస్తుండటంతో కలుపు తీసే వ్యవధి లేకుండా పోయింది. దీంతో పంటతోపాటు కలుపు పెద్దఎత్తున రావటంతో అన్ని గ్రామాల్లో కూలీల అవసరం పెరిగింది. కూలీలు రాక చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 6.68 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగుచేశారు. వీటిలో సింహభాగం 4.90 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. పది రోజుల నుంచి నిరంతరాయంగా వర్షం కురవటంతో పచ్చపురుగు ఉద్ధృతి పెచ్చుమీరింది. ప్రస్తుతం పచ్చపురుగు, ఆకుపచ్చ తెగులు, వేరుకుళ్లు తెగులుతో వేరుశనగ పంటకు నష్టం చేకూర్చుతోంది. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికి వ్యవసాయశాఖ అధికారులు మందులను సూచిస్తూ గ్రామాల్లో ప్రచారం చేయిస్తున్నారు. మొక్కజొన్నలోనూ మళ్లీ కత్తెర పురుగు విజృంభిస్తోంది. ఆముదంలో నామాల పురుగు ఆకులను పూర్తిగా తినేస్తోంది. ఇలా బాగా కురిసిన వర్షాలతో పంటలకు ఒకింత మంచి జరిగినా, ఆగకుండా కురిసిన కారణంగా రైతులకు అనేక విధాలుగా పెట్టుబడి భారం పెరిగింది.

జిల్లాలో కురిసిన వర్షాలతో పురుగులు, తెగుళ్లు వ్యాప్తి చెందాయని, వాటిని అదుపు చేయటానికి మందులు సిఫార్సు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురిసినా వేరశనగ పంట ఆశాజనకంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగు మందులు కొట్టినా కొన్ని సందర్భాల్లో లాభం ఉండటంలేదని విచారిస్తున్నారు. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.