రోడ్డు ప్రమాదం జరిగిందని ఘటనా స్థలం వద్ద ప్రజలు గూమికూడారు. ప్రమాదంలో గాయపడి నెత్తురోడుతున్న యువకుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు మాత్రం ముందుకు రాలేదు. ఈ ఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు వద్ద జరిగింది.
నల్లచెరువు రహదారిపై ద్విచక్ర వాహనాన్ని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ అంబులెన్స్‌లో కరోనా మృతదేహాన్ని తరలిస్తున్నారని… యువకుడికి సాయం చేసేందుకు ప్రజలెవ్వరూ ముందుకు రాలేదు. మరొక అంబులెన్స్ వచ్చినా.. శివకుమార్‌ని అంబులెన్స్‌లోకి ఎక్కించేందుకు స్థానికులు ముందుకు రాలేదు. దీంతో 108 సిబ్బందే స్ట్రెచర్‌పై ఆ యువకుడిని అంబులెన్స్‌లోకి ఎక్కించారు.
ఇదీ చదవండి: అధిక ఫీజులు వసూలుచేశారంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళన