ETV Bharat / state

'చమురు ధరలు తగ్గించాలి.. నిరంతర పెంపు బాధాకరం'

author img

By

Published : Jun 27, 2020, 6:36 PM IST

అనంతపురం జిల్లా ప్రధాన రహదారిపై తెదేపా, వామపక్ష నాయకులు రాస్తారోకో చేశారు. పెట్రోల్ ధరల పెంపును నిరసించారు.

increased petrol prices to be reduced
'పెరిగిన పెట్రోల్ ధరలు తగ్గించాలి'

చమురు ధరల పెంపును నిరసిస్తూ అనంతపురం జిల్లాలో ప్రధాన రహదారిపై తెదేపా, వామపక్ష నాయకులు రాస్తారోకో చేశారు. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్నాయని...ఈ పరిస్థితిల్లో ఇరవై రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోవటం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.

ఇదీ చదవండి:

తూకంలో తక్కువ.. మాయమవుతున్న ఇసుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.