ETV Bharat / state

చౌక దుకాణాల్లో కందిపప్పు ధర పెంపు - ananthapuram newsupdates

అనంతపురం జిల్లాలో చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకులు ఇకపై సామాన్యుడికి భారం కానున్నాయి. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలు ధరల పెంపుపై ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మార్చిలో చక్కెర ధర పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కందిపప్పు ధరను పెంచేసింది. గత నాలుగు నెలలుగా ఉచితంగా అందించిన బియ్యానికి కూడా కిలోకు రూపాయి చొప్పున వసూలు చేయనున్నారు.

Increase in price of onion in cheap shops at ananthapur district
చౌక దుకాణాల్లో కందిపప్పు ధర పెంపు
author img

By

Published : Dec 3, 2020, 7:21 AM IST

అనంతపురం జిల్లాలో చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకులు ఇకపై సామాన్యుడికి భారం కానున్నాయి. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలు ధరల పెంపుపై ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మార్చిలో చక్కెర ధర పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కందిపప్పు ధరను పెంచేసింది. గత నాలుగు నెలలుగా ఉచితంగా అందించిన బియ్యానికి కూడా కిలోకు రూపాయి చొప్పున వసూలు చేయనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డు దారులపై ప్రతి నెలా రూ.4.16 కోట్ల భారం పడనుంది. తెల్లరేషన్‌ కార్డుల స్థానంలో బియ్యం కార్డులను ప్రవేశపెట్టారు. అంత్యోదయ అన్నయోజన, అన్నపూర్ణ కార్డులను అలాగే కొనసాగిస్తున్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం సరకులు అందజేస్తోంది. మరోవైపు తమ కమీషన్‌ పెంచలేదని డీలర్లు వాపోతున్నారు.

కిలోపై రూ.27

బయట మార్కెట్‌లో కందిపప్పు ధర రూ.100కు పైగా ఉంది. రేషన్‌ దుకాణాల్లో ఇప్పటిదాకా కిలో రూ.40తో ఇచ్చారు. ఈనెల నుంచి రూ.67 వసూలు చేయనున్నారు. అంటే కిలో కందిపప్పుపై ఒకేసారి రూ.27 పెరిగింది. జిల్లాలో 12,21,826 కార్డుదారులు ఉన్నారు. ఈ లెక్కన నెలకు రూ.3.30 కోట్లు, ఏడాదికి సుమారు రూ.40 కోట్ల అదనపు భారం పడనుంది. అలాగే గత మార్చిదాకా అర కిలో చక్కెర రూ.10తో ఇచ్చేవారు. దాన్ని రూ.17కి పెంచారు. దీంతో కార్డుదారులపై ప్రతి నెలా రూ.85 లక్షలకు పైగా అదనపు భారం పడింది. కందిపప్పు, చక్కెర ధరల కారణంగా కార్డుదారులకు ప్రతి నెలా రూ.4.16 కోట్ల భారం పడుతోంది.

డీడీలు చెల్లించని డీలర్లు

పెంచిన ధరలకు అనుగుణంగా డీడీలు కట్టాలని అధికారులు ఆదేశించినా చాలామంది డీలర్లు ముందుకు రావడం లేదు. డీలర్లు కిలో కందిపప్పునకు రూ.66 చెల్లించి, కార్డుదారులకు రూ.67కు అమ్మాలి. పంచదారకు రూ.16 చెల్లించి రూ.17కు అమ్మాల్సి ఉంటుంది. అయితే లాక్‌డౌన్‌ నుంచి నెలకు రెండుసార్లు చొప్పున 16 విడతలుగా పంపిణీ చేసిన సరకులకు సంబంధించి బకాయిలు ఇంకా రాలేదని డీలర్లు వాపోతున్నారు. ఇప్పటివరకు 4 విడతల బిల్లులు మాత్రమే చెల్లించారని, ఇంకా 12 విడతలకు సంబంధించిన బకాయిలు రూ.కోట్లలో రావాల్సి ఉందని చెబుతున్నారు.

బకాయిలు చెల్లించాలి

ప్రభుత్వం నుంచి డీలర్లకు రావాల్సిన 12 విడతల బిల్లులను వెంటనే విడుదల చేయాలి. బిల్లులు సకాలంలో రాకపోవడంతో చాలా మంది డీలర్లు అప్పులు చేసి డీడీలు కట్టాల్సి వస్తోంది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి వాలంటీర్ల ద్వారా సరకులు పంపిణీ చేస్తున్నందున డీలర్లను ఉంచుతారా తీసేస్తారా అనే ఆందోళన మొదలైంది. మాకు జీవన భృతి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. - బాలనాగిరెడ్డి, రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

ఈనెల నుంచే అమలు

పెరిగిన కందిపప్పు ధరలు ఈనెల నుంచే అమలులోకి వస్తాయి. బియ్యానికి కూడా కిలో రూపాయి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి రేషన్‌ సరకులను వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. - రఘురామ్‌రెడ్డి, డీఎస్‌వో

ఇదీ చదవండి:

'ఏపీలో ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే చర్యలు తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.