అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో పీర్ల పండగ ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజామున అగ్ని గుండం మహోత్సవంలో భక్తులు పీర్లను ఎత్తుకొని గుండంలో కాలినడకతో నడిచారు. కోరిన కోరికలు నెరవేరాలని మనసులో స్మరించుకుని చాలా మంది భక్తులు నిప్పుల్లో నడిచారు. పీర్ల పండగ ఉత్సవాలను తిలకించేందుకు పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అగ్ని గుండం మహోత్సవం అనంతరం పీర్లను తెరతో కప్పి వేశారు. తిరిగి సాయంత్రం జలధి ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఇదీ చదవండి:రమణీయం... రాఘవేంద్రుడి మహారథోత్సవం