ప్రయాణికుల టికెట్లు తీసుకోవడంలో గంటల కొద్దీ జాప్యం అవుతుందని ఆతృతతో పరిగెత్తి రైలు ఎక్కబోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.ఈ ప్రమాదాల నుంచి ప్రయాణికులను రక్షించుకోవడనికి గుంతకల్లు రైల్వే ఒక కొత్త ఆలోచనతో నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. సులభ పద్దతిలో, టికెట్ కొనుగోలు వంటివి ఎలా చేసుకోవాలో,లఘుచిత్రం ద్వారా స్టేషన్ ఆవరణలో ప్రయాణికులకు చేసి చూపించారు. టికెట్ కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడకుండా ఉండే పరిస్థితికి స్వస్తి చెప్పే పద్దతులును కంటికి కనపడే విధంగా నాటకాలు ద్వారా ప్రజలకు అర్ధమయ్యే రీతిలో రైల్వే అధికారులు అవగాహన కల్పించారు.ఈ అప్లికేషన్ వల్ల సులభంగా ప్రయాణికుడు రైలు స్టేషన్‌కు వచ్చే 15 నిమిషాలలోపు టికెట్ పొందవచ్చని, ఆ టికెట్‌ను టికెట్ కలెక్టర్‌కు రైలులో చూపిస్తే సరిపోతుందనీ రైల్వే సుపరింటెండెంట్ తెలిపారు.
ఇదీ చూడండి చంద్రయాన్-2' మొదటి ప్రక్రియ విజయవంతం