ETV Bharat / state

'రైతులు సర్వం కోల్పోయి కష్టంలో ఉంటే...కన్నెత్తైనా చూడరా?' - ప్రభుత్వంపై లోకేశ్ కామెంట్స్

భారీ వర్షాలు, వరదల కారణంగా రైతులు సర్వస్వం కోల్పోయి పుట్టెడు కష్టంలో ఉంటే...సీఎం జగన్ కన్నెత్తైనా చూడటంలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. అనంతపురంలో పర్యటించిన ఆయన...వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే ఇక్కడి నుంచే ఉద్యమం ప్రారంభిస్తానని హెచ్చరించారు. అనంత జిల్లాలో రెండు వేల కోట్ల పంట నష్టం జరిగితే..,39 కోట్లేనంటూ నివేదికలు తయారు చేస్తూ రైతులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు 25 వేల పరిహారం ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

రైతులు సర్వం కోల్పోయి కష్టంలో ఉంటే...కన్నెత్తైనా చూడరా?

author img

By

Published : Oct 23, 2020, 9:34 PM IST

అనంతపురం జిల్లాలో తెదేపా నేత నారా లోకేష్ సుడిగాలి పర్యటనతో నాలుగు నియోజకవర్గాల రైతుల సమస్యలు తెలుసుకున్నారు. జిల్లాలో గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాప్తాడు నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు విరామం లేకుండా పర్యటించి అన్నదాతల ఆవేదన వింటూ..,నష్టపోయిన పంటలను పరిశీలించారు. పెద్దవడుగూరు మండలంలో కుళ్లిన పత్తి, వేరుసెనగ పంటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతపురం గ్రామీణం కామారుపల్లిలో రైతు శివయ్య కు చెందిన వేరుశనగ పంటను పరిశీలించి పెట్టుబడి వివరాలను తెలుసుకున్నారు. తన పుస్తెలు విక్రయించి పంటకు పెట్టుబడి పెట్టినట్లు శివయ్య భార్య లోకేశ్​ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం జగన్ రాయలసీమ వ్యక్తి అయివుండి..,ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోయినా కన్నెత్తి చూడటంలేదని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో రైతులకు డ్రిప్ రాయితీ లేకుండా చేశారని, వ్యవసాయ రుణాల్లో కోతలు పెట్టారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఊళ్లు తిరిగిన జగన్...,నష్టపోయిన రైతులను చూడటానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జిల్లా రైతులు 2 వేల కోట్ల పంటల పెట్టుబడిని నష్టపోగా.., కేవలం 39 కోట్లే నష్టంగా అంచనా వేయటం అన్నదాతలను అవమానించినట్లేనన్నారు. తమ ప్రభుత్వ హయంలో రైతులకు 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందజేశామన్నారు. బోర్లకు విద్యుత్ మోటర్లు బిగిస్తే జిల్లా నుంచే రైతు ఉద్యమం ప్రారంభిస్తామని సీఎం జగన్​ను హెచ్చరించారు.

జిల్లాలోని అనేక గ్రామాల నుంచి వచ్చిన రైతులు పంట నష్టపోయిన తీరును లోకేశ్​కు వివరించారు. ప్రభుత్వానికి బుద్ధివచ్చేలా..ఏ ఉద్యమం చేపట్టినా తాము మద్దతిస్తామని రైతులు లోకేశ్​కు భరోసానిచ్చారు.

రైతులు సర్వం కోల్పోయి కష్టంలో ఉంటే...కన్నెత్తైనా చూడరా?

ఇదీచదవండి

రాష్ట్రంలో ఉన్మాద పాలన నడుస్తోంది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.