ETV Bharat / state

టిక్‌టాక్‌ వీడియోలతో యువతులకు వల..యువకుడు అరెస్ట్​ - హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌ పోలీసులు

టిక్‌టాక్‌ వీడియోలతో యువతులను ఆకర్షించి.. ఆపై వేధింపులకు పాల్పడ్డ అనంతపురం జిల్లా పాతకోటకు చెందిన యువకుడిని తెలంగాణకు చెందిన రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

pathakota
పాతకొట యువకుడి అరెస్ట్
author img

By

Published : May 30, 2021, 5:44 PM IST

టిక్‌టాక్‌ వీడియోలతో యువతులను ఆకర్షించి.. ఆపై వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని హైదరాబాద్​లోని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని పాతకోటకు చెందిన పాలుకూరు నవీన్‌(23) స్థానికంగా ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతూ ఓ ప్రైవేటు న్యాయవాద సంస్థలో గుమస్తాగా పని చేస్తున్నాడు. టిక్‌టాక్‌ యాప్‌లో వీడియోలు తీయడానికి అలవాటుపడిన ఈ యువకుడు... వర్చువల్‌ నంబర్ల ద్వారా నకిలీ ప్రొఫైల్స్‌తో పలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి అనేకమందికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపేవాడు. వాటికి స్పందించిన వారిలో నుంచి యువతులను ఎంచుకొని స్నేహం నటించేవాడు. అనంతరం వ్యక్తిగత వివరాలనూ సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేయడం సహా వేధింపులకూ పాల్పడసాగాడు.

టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధం అమల్లోకి రాకముందు.. నగరానికి చెందిన యువతితో నవీన్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెతోపాటు కుటుంబసభ్యులు, బంధువుల వివరాలనూ సేకరించాడు. ఆపై తనను పెళ్లిచేసుకోవాలంటూ ఒత్తిడి చేయగా.. యువతి నిరాకరించడంతో ఆమె తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. ఈ విషయం ఆమె సమీప బంధువైన మహిళకు తెలియడంతో ఆమె నవీన్‌ను హెచ్చరించింది. దీంతో సదరు మహిళకూ అసభ్య సందేశాలు పంపించాడు. అంతటితో ఆగకుండా నకిలీ ఫ్రొఫైల్‌తో తెరిచి… ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాలో ఆమెను కాల్‌గర్ల్‌గా పేర్కొంటూ ఫోన్‌ నంబరును అందులో ఉంచి మానసిక క్షోభకు గురిచేశాడు. బాధితుల ఫిర్యాదుతో రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించి సదరు నిందితున్ని అతడి స్వస్థలానికి వెళ్లి అరెస్టు చేసి హైదరాబాద్​కు తీసుకొచ్చారు. శనివారం నిందితుడిని రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి.

రహస్య ప్రాంతంలోనే ఆనందయ్య.. రేపే తుది నివేదిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.