ETV Bharat / state

అత్తింటి వారు బైక్​ కొనివ్వలేదని భార్యను హతమార్చిన భర్త - undefined

అత్తింటి వారు ద్విచక్రవాహనాన్ని కొనివ్వలేదని భార్యను హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో కోపంతో భార్య గొంతుపై కాలితో తొక్కి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం నెమలపల్లిలో జరిగింది.

author img

By

Published : Sep 4, 2020, 7:55 PM IST

అనంతపురం జిల్లా పామిడి మండలం నెమలపల్లి గ్రామానికి చెందిన సుబ్బారాయుడు... 11 నెలల క్రితం ఉరవకొండ మండలం వజ్రకరూరు గ్రామానికి చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. నెల క్రితం తనకు ద్విచక్రవాహనం కొనివ్వాలంటూ అత్తింటి వారిని కోరాడు. తమకు అంత స్తోమత లేదని, ప్రస్తుతానికి కొనివ్వలేమని వారు చెప్పడంతో కోపోద్రిక్తుడైన సుబ్బారాయుడు లక్ష్మితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కోపంతో లక్ష్మి గొంతుపై కాలితో తొక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. విషయాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హంతకుడు సుబ్బరాయుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీచదవండి.

అప్పు తీర్చమన్న భర్తను చంపేశారు... కేసు పెట్టిన భార్యను కొట్టించారు...!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.