అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వాలు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయటంతో... పలు కాలనీలు ఏర్పడ్డాయి. వాటిలో కొంత మంది ఇల్లు నిర్మించుకుని నివాసాలు ఉంటున్నారు. మరికొన్ని కాలనీల్లో మౌలిక వసతులు లేక ఖాళీగా ఉండిపోయాయి. అధికారులు ఖాళీగా ఉన్న 392 పట్టాలు రద్దు చేశారు. రద్దు చేసి ఉన్న పట్టా స్థలాల్లో కంపచెట్లు, రాళ్లను తొలగించేందుకు యంత్రాలతో అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు తమకు ఎలాంటి నోటీసు పంపకుండా... పట్టాలను రద్దు చేసి ఆ స్థలాలు మరొకరికి ఇచ్చేందుకు పూనుకోవడం సరికాదన్నారు. ఇళ్లు నిర్మించుకునేందుకు గడువు ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు.
ఇవీ చదవండి...'విద్యోన్నతి' నిలిపివేత.. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే స్టడీ సర్కిళ్లు