అనంతపురం జిల్లా రాయదుర్గంలో పాత్రికేయ గృహ నిర్మాణ పథకాన్ని మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాత్రికేయులకు లబ్ధి చేకూరుతుందన్నారు. తన నియోజక వర్గం నుంచే ఈ పథకానికి ప్రారంభించడంఆనందంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాత్రికేయులకు శాశ్వత గృహాలు నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి