అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలోని మూడవ డివిజన్ కార్మికులను స్థానిక వైకాపా నాయకుడు నారాయణమూర్తి, అతని మిత్ర బృందం కరెన్సీ నోట్లతో సన్మానించారు. కొత్తపేట కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ తో కలిసి కార్మికులను వైకాపా నాయకులు సన్మానించారు. ఒక్కో కార్మికుడికి వెయ్యి రూపాయల కరెన్సీ దండను వేశారు. అంతేగాక వారికి మాస్కులు, కోడిగుడ్లను పంపిణీ చేశారు.
కరెన్సీ దండలతో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం - ధర్మవరంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
లాక్ డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని వారు చేస్తున్న కృషి అభినందనీయమని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అన్నారు.

కరెన్సీ దండలతో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం