ETV Bharat / state

కరోనా నివారణకు రెండు వెంటిలేటర్లు: బాలకృష్ణ

కరోనా నివారణకు రూ.25లక్షలతో 2 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు... అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కరోనా కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

hindupuram ml abalakrishna donates ventilators
కరోనా నివారణకు రెండు వెంటిలేటర్లు ఏర్పాటు చేసిన బాలకృష్ణ
author img

By

Published : May 18, 2020, 10:03 PM IST

కరోనా నివారణకు రెండు వెంటిలేటర్లు ఏర్పాటు చేసిన బాలకృష్ణ

హిందూపురం నియోజకవర్గంలో కరోనా నివారణకు రూ.25లక్షలతో 2 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. వైద్య సిబ్బందికి 100 పీపీఈ కిట్లు తన వంతుగా అందిస్తున్నట్లు తెలిపారు. బసవతారకం కాన్సర్ ఆసుపత్రి ద్వారా వీటిని అందుబాటులోకి తెస్తున్నామని ఆయన వెల్లడించారు. హిందూపురంలో కరోనా కేసులు పెరగటం ఆందోళన కలిగించే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు.

లాక్​డౌన్ నిబంధనలు పాటిస్తూ... హోమ్ క్వారంటైన్​లో ఉన్న కారణంగా బయటకు రావట్లేదని బాలకృష్ణ తెలిపారు. హిందూపురం సమస్యలపై నిత్యం కలెక్టర్, రెవెన్యూ, వైద్య అధికారులతో సమీక్షిస్తున్నట‌్లు వివరించారు. కరోనా లేని హిందూపురంని త్వరలోనే చూద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

'14వేల ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.