అనంతపురం జిల్లా కట్టకిందపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అక్రమంగా వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పాఠశాల భవనం కూల్చి ప్లాంట్ కడుతున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం... సంబంధిత వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి... : 17 నుంచి ఆంధ్రప్రదేశ్‌కు దశలవారీగా బస్సుల రాకపోకలు: కర్ణాటక ఆర్టీసీ