అనంతపురం జిల్లాలో రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ మేరకు చెన్నైకి చెందిన 12 మంది బాధితులు రైల్వే పోలీసులను ఆశ్రయించారు. నకిలీ నియామక పత్రాలతో మోసగించారని బాధితులు ఫిర్యాదు చేశారు. 50 మంది నుంచి సుమారు రూ.10 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు.
'ఇవి నకిలీ పత్రాలు'
నకిలీ ధ్రువపత్రాలతో గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లిన బాధితులు.. నియామక పత్రాలను అధికారులకు అందించారు. వాటిని పరిశీలించిన రైల్వే అధికారులు నకిలీ పత్రాలుగా గుర్తించారు. కేసును గుంతకల్లు ఒకటో పట్టణ పోలీసులకు బదలాయించారు. ఈ క్రమంలో నిందితుడు ఈనెల 18న కరోనాతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : రాజమహేంద్రవరం జైలు నుంచి 21 మంది ఖైదీలు విడుదల