ETV Bharat / state

అనంతపురం జిల్లా రాయదుర్గంలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం... - heavy rains in anantapuram news update

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వరద ముంపు ప్రాంతాల్లో రాయదుర్గం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పర్యటించారు. ప్రభుత్వం తరఫున ప్రజలను, వ్యాపారులను ఆదుకోవడానికి అధికారులతో కలిసి చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

heavy rains in anantapuram
నష్టపోయిన వ్యాపారులను పరామర్శించిన ప్రభుత్వ విప్​
author img

By

Published : Jun 29, 2020, 7:17 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. చేనేత మగ్గాలు, గార్మెంట్స్ దుస్తులు నీటిలో మునిగిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. లక్ష్మీ బజార్, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఆవరణంలో వర్షపు నీరు నిలిచి పోవడం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎడతెరపి లేకుండా 4 గంటల పాటు కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది.

రాయదుర్గం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సోమవారం ఉదయం పట్టణంలో పర్యటించారు. వ్యాపార దుకాణాల్లోకి నీరు రావడంతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆయన పరామర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు.

ఇవీ చూడండి...: ధర్మవరంలో కురిసిన భారీ వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.