అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు, గుత్తి మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దవడుగూరు సమీపంలోని పందుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేలాది ఎకరాల్లో సాగు చేసిన పత్తి, వేరుశేనగ, జొన్న పంటలు నీట మునిగాయి.
పెద్దవడుగూరు మండలంలో 4 ఇళ్లు, గుత్తి మండలం అబ్బేదొడ్డి, నాగసముద్రం గ్రామాల్లో మరో 2 ఇళ్లు నేలకూలాయి. నీలూరు, తంబళ్లపల్లి ,సొరకాయలపేట, లక్ష్ముంపల్లి, దిమ్మగుడి, చిన్నవడుగూరు, చిట్టూరు,రామరాజుపల్లి గ్రామాల్లో పత్తి, వేరుశనగ, జొన్న పంటలు పూర్తిగా నీటమునిగాయి. రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి.
ఇదీ చదవండి: